calender_icon.png 1 December, 2025 | 10:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దిక్షాదివస్ సరే.. స్తూపం ఏదీ?

29-11-2025 12:00:00 AM

కరీంనగర్,మవంబర్28(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమంలో కె సి ఆర్ దీక్ష దివా న్ కీలక ఘట్టం. ఈ దీక్ష దివాన్ లో కరింనగర్ గడ్డ కీలక భూమిక పోషించింది. బి ఆర్ ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కె సి ఆర్ అరెస్ట్ అయిన అలగమూర్ చౌరస్తా లో స్మృతి చిహ్నం ఏర్పాటు చేస్తామని ప్రకటిం చి చేతులు ఎత్తేశారు. నేడు ప్రతిపక్ష హోదా లో ఈ నెల 29న ఇక్కడ దీక్ష డిబాస్ ని నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.

‘ప్రత్యేక రాష్ట్రం వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో!’ ‘కేసీఆర్ శవయాత్రో.. తెలంగాణ జైత్రయాత్రో!’ అని గర్జించిన కె సి ఆర్ ఆమరణ దిక్ష ప్రారంభించింది ఈ గడ్డ పై నుండే. రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న రణగర్జన చేసి కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష. గల్లీ గల్లీనీ కదలించింది. ఢిల్లీని వణికించింది! సిద్దిపేట దీక్షాస్థలికి కరీంనగర్ నుంచి వీరతిలకంతో బయల్దేరిన కేసీఆర్ను అలుగునూరు వద్ద అరెస్టు చేసి.. వరంగల్కు, అక్కడినుంచి ఖమ్మంకు తరలించింది ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం.దీక్ష మీద సమైక్యవాద సర్కారు కుట్రలకు దిగడాన్ని తట్టుకోలేక జనం రోడ్డెక్కారు.

కరీంనగర్ నుంచి ఖమ్మం దాకా ఉద్యమ విద్యుత్తేజం వ్యాపించింది. గత్యంతరం లేని పరిస్థితిలో ఢిల్లీ మెట్టు దిగింది. తెలంగాణ ముందు తలవంచింది. ప్రత్యేక రాష్ట్రానికి తలూపింది. ఫలితమే డిసెంబర్ 9 ప్రకటన.

ఆ మాటపైనా కాంగ్రెస్ నిలబడలేకపోవడం, శ్రీకుట్ర కమిటీని దింపడం, తెలంగాణ సకలజనులూ ఉద్యమంలో చేయి కలపడం వంటివి తదనంతర పరిణా మాలు. వాటిన్నింటి ఫలితమే 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రావిర్భావం. అరవై ఏండ్ల కల సాకారమైంది.దీక్షాదక్షత యాదికి నేటితో 17 ఏండ్లు సందర్బంగా బి ఆర్ ఎస్ కరీంనగర్ గడ్డ పై ఘనంగా నిర్వహించేందుకు సిద్దం అయింది

--దీక్షా దివస్ పోస్టర్ ఆవిష్కరణ 

ముకరంపుర, నవంబరు 28 (విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిఆర్‌ఎస్వి జిల్లా కో ఆర్డినేటర్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రూపొందించిన దీక్ష దివస్ కు సంబంధించిన గోడప్రతులను శుక్రవారం మాజీమంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జిల్లా పార్టీ అధ్యక్షులు జివి రామకృష్ణారావులు ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా పొన్నం అనిల్ కుమార్ మాట్లాడుతూ... 29న దీక్ష దివస్ కార్యక్రమాన్ని శాతవాహన విశ్వవిద్యాలయం ఎదురుగా రేపు నిర్వహించను న్నా మని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థి లోకం తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, టిఆర్‌ఎస్వి శాతవాహన యూనివర్సిటీ ఇంచార్జ్ చుక్కా శ్రీనివాస్, చెన్నమళ్ళ చైతన్య, బొంకూరి మోహన్, బండ వేణు యాదవ్, నేతి రవి వర్మ, పటేల్ సుధీర్ రెడ్డి, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, మిడిదొడ్డి నవీన్, అన్వేష్, శ్యామ్ సుందర్ రెడ్డి, తదితరులుపాల్గొన్నారు.