27-12-2025 08:47:33 PM
తాండూరు,(విజయక్రాంతి): ప్రింట్, ఎలక్ట్రానిక్ జర్నలిస్ట్ ల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి న్యాయం చేయాలంటూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని టి యు డబ్ల్యూ జే (H143 ) నాయకులు ఆసిఫ్ హుస్సేన్, ప్రహ్లాద రావు వినతిపత్రం అందించారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమెను కలిసి కోరారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ నాయకులు మాట్లాడుతూ... అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు మంజూరు చేసి అక్క్రిడేషన్ సమస్యల ను అధికారులు పాలకులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.