27-12-2025 08:43:59 PM
బోయినపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నిరోజిపల్లి సర్పంచ్ అనుముల భాస్కర్ శనివారం గ్రామస్తులతో కలిసి సెస్ చైర్మన్ చిక్కాల రామారావుకు వినించపత్రం సమర్పించారు. గ్రామంలో ఎస్సీ కాలనీలో స్మశాన వాటిక వద్ద విద్యుత్ తీగలు దొంగలు చోరి చేయగా విద్యుత్ సరఫరా గత కొద్ది నెలలుగా నిలిచిపోయింది. దీంతో స్మశాన వాటిక వద్ద అంధకారం నెలకొంది.
హరితహారంలో పల్లె ప్రకృతిలో మొక్కలకు నీరు అందించేందుకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు అవుతున్నాయని ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. వెంటనే విద్యుత్ తీగలు అమర్చి, విద్యుత్ సరఫరా పుణ్యదుద్ధరించాలని ఆయన కోరారు. అందుకు సెస్ చైర్మన్ చిక్కాల రామారావు స్పందించి సత్వరమే విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు హామీ ఇచ్చినట్లు సర్పంచ్ భాస్కర్ తెలిపారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేస్ ఎండి బిక్షపతి, మాజీ వైస్ ఎంపీపీ నాగయ్య తదితరులున్నారు.