27-12-2025 08:54:13 PM
రాజాపూర్: అండర్ 14 ఖోఖో రాష్ట్రాస్తాయి జట్టుకు రాజాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ ఇబ్రహీం తెలిపారు. పాఠశాలలో చదివే జాశ్వంత్ గత నవంబర్- 2025 లో జిల్లా స్థాయిలో అండర్ 14 విభాగంలో జిల్లా స్థాయి ఖో ఖో పోటీలు ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపిక కావడం అభినందనీయం అని అన్నారు. ఈ డిసెంబర్ నెలలో 30'31' &1st జనవరి 26 న వికారాబాద్ జిల్లా తాండూర్ లో జరిగే రాష్ట్రస్థాయి ఖో ఖో జట్టు లో జాశ్వంత్ ఆడనున్నట్లు తెలిపారు. విద్యార్థి రాష్ట్ర స్థాయి ఖో ఖో జట్టుకు ఎంపికైన సందర్బంగా శనివారం జాశ్వంత్,పీ డీ వెంకటమ్మ ను ప్రత్యేకంగా అభినదించారు.