calender_icon.png 10 August, 2025 | 2:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాధులు ప్రబలకుండా చూడాలి..

25-07-2025 12:00:00 AM

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని దేమికలాన్ గ్రామం ఎస్సీ కాలనీలో అపారిశుధ్యం కారణంగా పలువురు అనారోగ్యంపాలయ్యారు. మరికొందరు వాంతులు, విరేచనాల బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. కాలనీలో డయేరియా ప్రబలడంతో ఇద్దరు మృతిచెందారు. చనిపోయిన వారిద్దరూ తండ్రీ కొడుకులే. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతిచెందడంతో కాలనీవాసులు ఆందోళనకు గురవతున్నారు.

ప్రస్తుతం కాలనీవ్యాప్తంగా సుమారు 30 మంది మంచంపట్టారు. వీరిలో తీవ్ర అస్వస్థతకు గురైన ఎనిమిది మంది కామారెడ్డి జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలనీవాసులు 10 రోజులుగా డయేరియా విజృంభించడంతో కాలనీవాసులు ఆందోళనకు గురవుతున్నారు. పదిరోజుల్లో వైద్యారోగ్యశాఖ ఒకే ఒకరోజు మెడికల్ క్యాంప్ నిర్వహించింది.

వైద్యులు పలువురి పరీక్షించి మెడిసిన్ అందించారు. వైద్యారోగ్యశాఖ మరోసారి వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని కాలనీవాసులు కోరుతు న్నారు. అలాగే కాలనీలో క్రమం తప్పకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాలనీలో ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించాలంటున్నారు.

                              దినేశ్, కామారెడ్డి