calender_icon.png 12 August, 2025 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్లమెంట్‌లో ఓబీసీ రిజర్వేషన్ల ఎజెండా!

24-07-2025 12:00:00 AM

స్వాతంత్య్రమొచ్చిన తర్వాత రూపొందించిన రాజ్యాంగంలో బీసీల ప్రస్తావన రాలేదు. ఇప్పటివరకు ఏడుసార్లు జనగణన జరిగింది. అందులో కేవలం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన వివరాలను మాత్రమే వెల్లడించారు. ఉదృతమైన బీసీ ఉద్యమాల మూలంగా మొదటి రాజ్యంగ సవరణ ద్వారా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు బీసీకులాలను గుర్తించి వారి అభివృద్ధికి కావాల్సిన సిఫార్సులు చేయడానికి జాతీ య, రాష్ట్ర స్థాయిలో బీసీ కమిషన్లను ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించారు.

కానీ కేంద్రం నియమించిన కాకా కాలేల్కర్, మండల్ కమిషన్‌లు, రాష్ర్టంలో నియమితమైన అనేక బీసీ కమిషన్‌లు అనేక సిఫార్సులు చేసినా, ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 1970లో అనంతరామన్ కమిషన్ సూచించిన రిజర్వేషన్లు రాష్ర్టం లో అమలవుతున్నాయి. ప్రభుత్వాలకు, రాజకీయ పార్టీలకు బీసీల పట్ల చిత్తశుద్ధి లోపించడం వల్ల తాము నియమించిన కమిషన్లు సూచించిన అనేక సిఫార్సులను తామే చెత్తబుట్టలో వేసి బీసీలను నిరంతరాయంగా అన్యాయానికి గురిచేశాయి.

రాజ్యాంగంలోని ప్రవేశిక, ఆదేశసూత్రాలు, ప్రాథమిక హక్కులు, 9వ షెడ్యూల్ లాంటి బంగారు భవిష్యత్‌ను ఇచ్చే ప్రకరణలోని అనేక హామీలు బుట్టదాఖలు అవుతున్నా యి. సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సమానత్వం లాంటి సిద్ధాంతాలను అన్ని స్థాయిల్లో అపహాస్యం చేస్తున్నారు. సంఖ్యాబలం ఉన్నా సమైక్య బలం లేక చతికిల పడటం వల్ల..

బీసీలను మభ్యపెట్టడమో, విస్మరించడమో, అణచివేయడమో ప్రభుత్వాలు మారినా నిరంతరం కొనసాగుతూనే ఉంది. సుతిమెత్తని దోపిడీని, నంగనాచితనాన్ని గుర్తుపట్టే రోజులు వ చ్చాయి. మూడువేల సంవత్సరాల నుంచి భారత సమాజాన్ని పట్టిపీడిస్తూ, మనుషులను విడదీసి, గిరిగీసి పాలిస్తున్న కులవ్య వస్థ వల్ల వాస్తవానికి లాభపడింది ఎవరో అందరికీ తెలియంది కాదు. 

బీసీలను వంచించి.. గద్దెనెక్కిన బీజేపీ 

స్వాతంత్య్రమొచ్చాక కూడా ఈ వ్యవస్థ ను కొనసాగించడానికి అనేక ప్రయత్నా లు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. తరతరాలుగా ఈ కులవ్యవస్థ వల్ల అగ్రకులాలే ప్రయోజనం పొందాయన్నది చారి త్రక సత్యం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులగణన చేస్తామని గద్దెనెక్కి, కాంగ్రెస్ తీ సుకున్న బీసీల రాజ్యాధికారం ఎజెండాను, పార్టీకి వస్తున్న ఆదరణను చూడలేక, దూ కుడుకు అడ్డుకట్టవేసేందుకు అసలు కులగణన చేయమని మొండికేసి తర్వాత జన గణనతో పాటు కులగణన చేస్తామని ప్రకటించింది.

కానీ శాసనసభలో తీర్మానం చేసి విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో42 శా తం రిజర్వేషన్ల బిల్లును రేవంత్ ప్రభుత్వం పంపిస్తే ఎందుకు ఆమోదించకుండా తా త్సారం చేస్తుందో బీసీ సమాజం ఆలోచించాలి. 78 సంవత్సరాలుగా జరిగిన అనేక ఉద్యమాల్లో రాజకీయ కార్యక్రమాల్లో నిబద్ధతతో పాల్గొని, జెండాలు మోసింది అత్య ధికంగా బీసీలే.

ఇప్పటికే పోరాడి సాధించిన విద్య, ఉపాధి రిజర్వేషన్లలో క్రిమీలే యర్ వంటి విధానాల ద్వారా ఏదో ఒకరూపంలో కాళ్లల్లో కట్టెలుపెట్టే ప్రయత్నం జరుగుతుంది. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ఊరించడం కాదు, రాష్ర్ట అధ్యక్ష పదవి ఎవరికీ కట్టబెట్టారో వాళ్ల నైజం అర్థమైంది కదా? చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్ల అమలు కోసం రాజ్యాంగంలోని 31(బి), తొమ్మిదో షెడ్యూల్ వంటి అనేక రక్షణ కవచాల ద్వారా న్యాయ వ్యవస్థల ద్వారా కాపాడుకోవచ్చు.

అదేవిధంగా సుప్రీంకోర్టు 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని చెబుతూనే కులగణన డేటా ఉన్న ప్పు డు పెంచుకోవచ్చని కూడా చెప్పిందని న్యాయ నిపుణులు అంటున్నారు. రేవంత్ ప్రభుత్వం ఆర్డినెన్స్ వల్ల 42 శాతంతో కలి పి 67 శాతం దాటడం లేదు. తమిళనాడులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా 69 శాతం రిజర్వేషన్లు అమలయ్యేందుకు నాటి కాంగ్రెస్ ప్ర భుత్వం సహకరించింది.

అస్తిత్వ ఉద్యమాల పట్ల నిర్దిష్టమైన అభిప్రాయంతో ఉన్న అనేక పార్టీలు ఇప్పటికే జంతర్‌మంతర్ మహాధర్నాకు మద్దతు తెలిపాయి. పార్లమెంట్ సమావేశాల్లో ఓబీసీల రిజర్వేషన్ల ఎజెండా అమలు చేసి, బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాల్సిన బా ధ్యత కేంద్ర ప్రభుత్వానికే ఉంది. ఎస్సీ, ఎస్టీ లకు స్వాతంత్య్రమొచ్చినప్పటి నుంచి రిజర్వేషన్ ఫలాలు అందలేదు. స్వాతంత్య్రమొ చ్చిన 27 సంవత్సరాల తర్వాత గుడ్డిలో మెల్ల అన్నట్టుగా రిజర్వేషన్లు కల్పించారు.

అందులో 50 శాతానికి పైగా ఉన్న ఓబీసీలకు 25 శాతం రిజర్వేషన్లను 45 సంవ త్సరాల నుంచి అమలు చేస్తున్నారు. కేంద్ర ఉన్నత సర్వీసుల్లో కేవలం 10 శాతం మా త్రమే బీసీలు ఉన్నారు. కేం ద్ర, రాష్ర్ట సచివాలయాలు, కమిషనరేట్లు అగ్రకుల అగ్ర హారాలయ్యాయి. న్యాయస్థానాల్లో బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల రాష్ర్ట హైకోర్టులు, సుప్రీంకోర్టులో బీసీ న్యాయమూర్తులు వేళ్లపై లెక్కపెట్టే విధంగా కూడా లేరు. మండల్ వ్యతిరేక ఉద్యమానికి ఊపు వచ్చినప్పుడు అరుణ్‌శౌరి లాంటి ఎడిటర్ వ్యతిరేకులను రెచ్చగొట్టిన సంగతి ఎవరూ మరచిపోలేదు. 

మీడియాలోనూ కనిపించని బీసీలు 

బీసీల ఎజెండాను ప్రభావితం చేయగలిగే మీడియా జర్నలిస్టుల్లో అట్టడుగు వర్గాలవారు లేకపోవడం బలమైన కార ణం. ఇప్పటికీ సింహభాగం అగ్రకులాల వాళ్లే జర్నలిస్టులుగా కొనసాగుతుండటం తో బీసీల గోడు.. వారి గురించి రాసే పరిస్థితి, వినే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ ప్రభుత్వం కులగణన చేసి చరిత్ర సృష్టించింది.

రిజర్వేషన్ల అమలు కోసం డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసిం ది. కమిషన్ సిఫార్సుల ఆధారంగా విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో వెనుకబడిన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం దక్కాలనే ల క్ష్యంతో ముందుకు సాగుతుంది. కాంగ్రెస్ దూకుడు చూసి కేంద్రం అనివార్యమైన స్థితిలో కులగణనకు ఒప్పుకుంది. వారి భయమంతా కులాల బలం తెలిసినప్పుడు హిందువుల ఓట్లలో చీలికవచ్చి చేటు జరుగుతుందేమోనని, అందుకే దశాబ్దం పాటు దాటవేస్తూ వచ్చింది. ఢిల్లీ కేంద్రంగా బీసీ సంఘాలు చేసిన ధర్నాలో కాంగ్రెస్ సంఘీభావం చెప్పేసరికి బీజేపీకి పాలుపోలేదు.

నిన్నటి వరకు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎ త్తు.. కులగణనతో ఓబీసీల సంఖ్య మారితే, రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేయడం సహజం. ఇదే జరిగితే, రాజకీయంగా, సామాజిక సమీకరణలు దెబ్బతింటాయని కేంద్రంలోని బీజేపీ భావించింది. కాలయాపన చేయకుండా తెలంగాణ ప్రభుత్వం పంపిన బీసీ రిజర్వేషన్ చట్టాలను తొమ్మిదో షెడ్యూల్‌లో ఉంచడం వల్ల భారతదేశం ఉన్నత వర్గాల కంటే సమానత్వా న్ని విలువైనదిగా భావిస్తుందని అందరికీ చాటిచెప్పినట్టవుతుంది. ఈ కీలక సమయంలో మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాం ధీ ఒత్తిడి పెంచాలి.

బీసీల వ్యతిరేక పార్టీగా ముద్రపడిన బీజేపీ పరిస్థితి చూస్తే అనుమానం రాకమానదు. నమ్మి నానపోస్తే పుచ్చులైనట్టు పార్లమెంట్ సభ్యులుగా ఎనిమిది మందిని గెలిపిస్తే.. ఒక్కో మనిషి రో జుకో మాట మాట్లాడుతున్నారు. సంజయ్ మాత్రం ముస్లిం రిజర్వేషన్లు లేకపోతే పార్లమెంట్‌లో అమలు చేయిస్తానని కామెంట్ చేస్తే, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రాంచందర్‌రావు 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును 9వ  చేర్చలేమంటూ రిజర్వేషన్ల కు వ్యతిరేకంగా వకాల్తా పుచ్చుకున్నారు. బీసీ సామాజికవర్గం ఉపరాష్ర్టపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా స్వతంత్య్రంగా చేసిం ది కాదని విపక్షాలు మొత్తుకుంటున్నాయి. 

ఆర్థికంగా బలహీనవర్గాలకు ప్రస్తుతం ఈ డబ్ల్యూఎస్ 10 శాతం ఉన్న రిజర్వేషన్లలో ఓసీ ముస్లింలు ఉన్నప్పుడు బీసీ ముస్లింలకు అడ్డంకి ఏమిటీ అనే ప్రశ్న ఉ త్పన్నమవుతుంది. రాజకీయ బానిసలుగా చూసే పార్టీల అధికార మార్పిడి కోసం దేశవ్యాప్తంగా బీసీలందరూ ఐక్య పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్న మైంది. తెలంగాణ డిమాండ్‌కు మద్దతు ఇచ్చినట్టయితే, రాజ్యాంగ న్యాయ చర్చల కు తగు సమయం కాదని గ్రహించి, కేంద్ర ప్రభుత్వం కొరివి పెట్టకుండా భారత గణతంత్రం..

దాని అత్యంత వెనుకబడిన పౌ రుల గౌరవం, స్వరం, ప్రాతినిధ్యం కోసం వెంటనిలుస్తామనే స్పష్టమైన సందేశం పంపగలదు. నేను బీసీ బిడ్డను అని జబ్బలు చరుచుకొనే మోదీ పెద్దన్న పాత్ర పోషిస్తే, ఈ వైవిధ్యభరితమైన దేశాన్ని ఏకం చేసే రాజ్యంగ విలువలకు ఇది ఒక అద్భుతమైన ధ్రువీకరణ అవుతుంది. బీసీ లు పూనుకొని ‘జకముక’ రగిలించితే అధికార భుజం మార్చుకోవడం ఎంతో దూరంలో లేదు.