23-07-2025 01:37:22 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో అక్కడ గంజాయి, డ్రగ్స్ పట్టుబడుతున్న ఘటనలో చోటుచేసుకుంటునే ఉన్నాయి. తాజాగా నగరంలో మరోసారి డ్రగ్స్(Drugs seized) ముఠా గుట్టురట్టు అయింది. డ్రగ్స్ విక్రయిస్తున్న తొమ్మిది మందిని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ పోలీసులు(Hyderabad Narcotics Enforcement Wing Police) బుధవారం అరెస్ట్ చేశారు. కొకైన్ సరఫరా చేస్తున్న ఆరుగురు, మెఫిడ్రీన్ సరఫరా చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 286 గ్రాముల కొకైన్, 11 గ్రాముల ఎక్స్ టసీ, తుపాకీ, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను విచారిస్తున్నారు.