calender_icon.png 23 July, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శరవేగంగా మూడో రైల్వే ట్రాక్ పనులు.. పలు రైళ్ల నిలిపివేత

23-07-2025 01:57:26 PM

25 నుంచి 27 వరకు రైళ్ళు రద్దు

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మూడో రైల్వే ట్రాక్ పనుల నేపథ్యంలో పలు రైళ్లను నిర్మించారు. నిర్మాణ పనుల రీత్యా పెద్దపల్లి రైల్వే బైపాస్ మార్గంలో నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 25 నుంచి 27 తేదీన వరకూ రైళ్ల రాకపోకలు ఉండవు.  సిర్పూర్ టౌన్ - కరీంనగర్, కరీంనగర్- సిర్పూర్ టౌన్, కాజిపేట్ -సిర్పూర్ టౌన్, బల్లార్షా - కాజిపేట్, కాజిపేట్ - బల్లార్షా, సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్, రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లను రీ రూట్ చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే కి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ ప్రకటించారు. నిర్మాణ పనుల కారణంగా రైళ్ల రాకపోకల నిలిపివేత వల్ల  నెలకొన్న అసౌకర్యాన్నీ ప్రయాణికులు అర్థం చేసుకోవాలన్నారు. ప్రకటించిన రైలు నిలిపివేత తేదీల్లో ప్రజలు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని కోరారు.