calender_icon.png 23 July, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ హయాంలో ఆర్టీసీ బలోపేతం

23-07-2025 02:01:11 PM

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం కింద 200 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంజీబీఎస్ బస్టాండ్(RTC Celebrations)లో వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమిటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్(RTC MD Sajjanar) హాజరయ్యారు. 

ఈ సందర్బంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) మాట్లాడుతూ... కాంగ్రెస్ హయాంలో ఆర్టీసీ(RTC) బలోపేతం అవుతూందని చెప్పారు. మహాలక్ష్మి పథకం(Mahalakshmi Scheme) ద్వారా ఆర్టీసీ లాభదాయకంగా మారిందని తెలిపారు. 200 కోట్ల ఉచిత ప్రయాణాలతో రూ. 6వేల కోట్లను ఆర్టీసీ ఆర్జించిందని సూచించారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ఆర్థికంగా నిలదొక్కుకుందన్నారు. ఇటీవల ఆర్టీసీ.. వేల కొత్త బస్సులు కొనుగోలు చేసింది.. ఆర్టీసీ తన ప్రయాణికుల సంఖ్యను పెంచుకుంటోందని తెలిపారు. ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేటు 67 నుంచి 90 దాటిందని వెల్లడించారు. హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా మారుస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వడ్డీ లేని రుణం ప్రక్రియను కొద్ది రోజుల్లో ప్రకటిస్తామని పేర్కొన్నారు.