calender_icon.png 23 July, 2025 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగరులు రాజకీయాల్లోకి రండి..!

23-07-2025 01:51:18 PM

జిల్లా అధ్యక్షులు గట్టు శ్రీను పిలుపు

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం వాటా కల్పిస్తున్న నేపథ్యంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సాగరులు అత్యధికంగా పోటీ చేసేందుకు ఆసక్తిగల వారు రాజకీయాల్లోకి ముందుకు రావాలని సగర సంఘం జిల్లా అధ్యక్షులు గట్టు శ్రీను పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సూచించిన విధంగా పొలిటికల్ పవర్ మాస్టర్ కి అని అందుకని సగరులు కూడా రాజకీయంగా ఎదిగేలా వారిని ప్రోత్సహిస్తూ ప్రత్యేక రాజకీయ శిక్షణ వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 26న జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల ముందు ఉన్న ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.