23-07-2025 01:53:59 PM
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): ఓ వ్యక్తి చెట్టుకి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం వేపలగడ్డ గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు పోలీసుల వివరాల మేరకు వేపల్లెగడ్డ గ్రామానికి చెందిన ధారావత రమేష్ దంపతుల మధ్య గత కొంతకాలంగా కుటుంబ విభేదాలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో భార్య 20 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. అయితే గత రాత్రి తన ఇంట్లో టీవీ చూస్తున్న రమేష్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బయటకు తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు రమేష్ పిల్లలు, తల్లి ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ హత్య చేసుకున్నాడా లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.