13-10-2025 08:12:19 PM
ప్రజావాణి ఐదు శాఖల అధికారులు హాజరు..
తాండూరు (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ ఆదేశాలు కొందరు అధికారులు యథేచ్ఛగా బేఖాతరు చేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ విడుదల అయినందున ప్రజావాణిని జిల్లా కలెక్టర్ తాత్కాలికంగా వాయిదా వేశారు. సోమవారం నుండి యధావిధిగా ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు సోమవారం ప్రజావాణి నిర్వహించాలని అందుకుగాను అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు.
కాని పెద్దముల్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించేందుకు కేవలం ఐదు శాఖల అధికారులు మాత్రమే హాజరయ్యారు. ఎమ్మార్వో, ఎంపీడీవో, ఎంఈఓ, ఏపీఎం, ఏపీవో, విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్ ప్రజావాణిలో పాల్గొనగా మిగతా శాఖల అధికారులు హాజరు కాలేదు. విద్యుత్ శాఖకు సంబంధించి మూడు అర్జీలు రెవెన్యూ శాఖకు ఒక అర్జీ వచ్చింది. ఈ విషయమై ఎంపీడీవో రతన్ సింగ్ కు వివరణ కొరగా హాజరుకాని అధికారులపై జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపిస్తామని అన్నారు.