calender_icon.png 13 October, 2025 | 11:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీనియర్ నాయకులకే జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలి

13-10-2025 08:09:51 PM

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాకిటి బాలరాజ్..

వనపర్తి టౌన్: కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని బ్రతకటానికి వచ్చిన వారికి కాకుండా కాంగ్రెస్ పార్టీని బ్రతికించిన వారికి జిల్లా అధ్యక్ష పదవులకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాకిటి బాలరాజ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా అధ్యక్ష పదవులను ఏఐసీసీ అబ్జర్వర్లు అభిప్రాయం మేరకు జిల్లా అధ్యక్షులను నియమించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా అధికారంలో ఉండాలి అంటే కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన సీనియర్ నాయకులకే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనే లక్ష్యంతో నికార్సుగా పనిచేస్తున్నానని ఆయన తెలిపారు.