03-09-2025 05:45:17 PM
నకిరేకల్,(విజయక్రాంతి): నకిరేకల్ లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా క్యాసియో ఫెస్టిలా, గుల్మోర, మామిడి, కానుగ, సీతాఫలం, వేప, సపోటా, అల్లనేరేడు విత్తనాలు సుమారు 10,000 వరకు సేకరించారు. బుధవారం ఆ విత్తనాలను నకిరేకల్, శాలిగౌరారం, కేతేపల్లి మండలాల్లో గుట్టల వెంబడి, చెట్లు తక్కువగా ఉన్న ప్రదేశాలలో, ఖాళీ ప్రదేశాల్లో చల్లారు.
రాష్ట్రంలో ప్రతి సంవత్సరం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నందున భూతాపం నుండి ఉపశమనం పొందాలంటే విత్తనాలు చల్లటం, మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. పచ్చని వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రకృతిని మనం రక్షిస్తేనే ప్రకృతి మనల్ని రక్షిస్తుందన్నారు.