03-09-2025 05:52:08 PM
నకిరేకల్,(విజయక్రాంతి): నకిరేకల్ పట్టణంలోని వివిధ వార్డులలో ఇండ్లపై నుండి పోయే 11 కేవీ కరెంటు తీగలను వెంటనే తొలగించాలని సిపిఐ ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల డిమాండ్ చేశారు. బుధవారం విద్యుత్ ఏ డి ఈ సురేష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటి సర్వేలో విద్యుత్ కు సంబంధించిన అనేక సమస్యలపై ప్రజలు విన్నవించారని పేర్కొన్నారు. ఇండ్లపై కరెంటు తీగలు ఉండటంవల్ల ఈదురు గాలులకు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు ఇటీవల 16వ వార్డు గణేష్ నగర్ లో పర్వతం దానమ్మ ఇంటిపై 11 కేవీ లైను తగిలి ప్రాణాపాయస్థితికి వచ్చిందన్నారు.
అదేవిధంగా చీమల గడ్డ ఎస్సీ కాలనీలో ఇండ్లపై ఉన్న కరెంటు తీగలను తొలగించాలన్నారు. ఆ ప్రాంతంలో విద్యుత్తు కరెంటు తీగలను సరి చేసేందుకు విద్యుత్ స్తంభాలు నిలిపి నేటికీ ఆ పనులు చేపట్టలేదన్నారు. వివిధ ప్రాంతాలలో రహదారుల వెంబడి రక్షణ లేని ట్రాన్స్ఫార్మర్ల వల్ల ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, వాటికి రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలన్నారు. శిధిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేయాలని, కొత్తగా ఏర్పాటు అయిన కాలనీలలో వీధి స్తంభాలు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు.