03-09-2025 05:42:15 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ సీసీ శేఖర్ బుధవారం తన నిజాయితీని చాటుకున్నారు. నిజామాబాద్ నుండి మంగళవారం రాత్రి నిర్మల్ కు వస్తుండగా ముక్కాలకు చెందిన లక్ష్మణ్ లాప్టాప్ మర్చిపోయి సొంత గ్రామంలో దిగిపోయారు. నిర్మల్ డిపోలో బస్సులు పెడుతుండగా లాప్టాప్ కనిపించడంతో ఆర్టీసీ సిబ్బందికి అప్పగించి అందులో ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా లబ్ధిదారునికి పిలిపించి అప్పగించడం జరిగిందని నిర్మల్ డిఎం పండరీ తెలిపారు