03-09-2025 04:46:42 PM
బిజెపి జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి,
చిలుకూరు: వినాయకుని అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండి పాడిపంటలు బాగా పండి ఆయురారోగ్యాలతో ఉండాలని సూర్యాపేట జిల్లా బిజెపి అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి(District BJP President Challa Srilatha Reddy) అన్నారు. బుధవారం చిలుకూరు మండల కేంద్రంలో వినాయకుడి పూజలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు బండారు కవిత రెడ్డి, జిల్లా పార్టీ నాయకులు జల్ల జనార్ధన్, మండల పార్టీ అధ్యక్షులు పారెల్లి మహేష్, మండల ప్రధాన కార్యదర్శి కొండ శ్రీను గౌడ్, ఉపాధ్యక్షులు వన్నాపురం సతీష్, జడ్పిటిసి మండల కన్వీనర్ తిపిరి శెట్టి బసవయ్య, సోషల్ మీడియా కన్వీనర్ బుడిగే వీరబాబు, మండల నాయకులు కాశయ్య, వినాయక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.