calender_icon.png 3 September, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏరియా జిఎంగా బాధ్యతలు స్వీకరించిన రాధాకృష్ణ

03-09-2025 05:48:46 PM

మందమర్రి,(విజయక్రాంతి): సింగరేణి ఏరియా నూతన జనరల్ మేనేజర్ గా ఎన్ రాధాకృష్ణ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జయం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నూతన జీఎంకు ఏరియా  ఎస్ఓటు జిఎం విజయప్రసాద్, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, కేకే గ్రూప్ ఏజెంట్ రాంబాబు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ భూ శంకరయ్య, ఐఈడి ఎస్ఈ కిరణ్ కుమార్, అన్ని డిపార్టుమెంట్ల హెచ్ఓడీ లు పుష్పగుచ్చం అందజేసి  ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏరియా స్థితి గతులను అన్ని డిపార్ట్మెంట్ల హెచ్ఓడి లు నూతన జీఎంకు వివరించారు.ఈ కార్యక్రమంలో జిఎం కార్యాలయం అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.