03-09-2025 05:55:50 PM
కంగ్టి,(విజయక్రాంతి): కార్మికుల సమస్యలపై నిరసన చేస్తుంటే దురుసుగా ప్రవర్తించిన ఎంపిడిఓ, ఎంపిఓలపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సీఐటీయూ డివిజన్ కార్యదర్శి రమేష్ అన్నారు. బుధవారం కార్మిక సమస్యలను పరిష్కరించి. పెండింగ్ జీతాలను చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో స్థానిక ఎంపిడివో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తుంటే అధికారులు సత్యయ్య, సుభాష్ లు బయటికి వచ్చి గ్రామాల్లో పనిచేసుకోమంటే ధర్నాలు చేస్తున్నారని దళితుల పేరుతో భూతులు తిడుతూ దురుసుగా ప్రవర్తించిన ఎంపిడిఓ సత్తయ్య, ఎంపిఓ శుభాష్ ల పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలనీ డిమాండ్ చేసారు. లేని యెడల జిల్లా మొత్తంలో ఉద్యమలు చేపడుతమన్నారు.