calender_icon.png 19 January, 2026 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెచ్‌సీఏ గవర్నింగ్ కౌన్సిల్‌ను రద్దు చేయండి

18-01-2026 12:00:00 AM

బీసీసీఐకి టీసీఏ ఫిర్యాదు

అర్హత లేనివారిని తొలగించాలని డిమాండ్

హైదరాబాద్, జనవరి 17: తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెట్ నైపుణ్యాన్ని వెలికితీయడమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై మండిపడింది. టీసీ ఏ ప్రతిపాదిత తెలంగాణ టీ20 ప్రీమియర్ లీగ్ నిర్వహణ కోసం హెచ్‌సీఏ ప్రకటించిన పాలకమండలిని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ బీసీసీఐకి ఫిర్యాదు చేసింది. హెచ్‌సీఏ ప్రకటన ప్రారంభం నుంచే చెల్లదని, సు ప్రీంకోర్టు ఆమోదిందించిన బీసీసీఐ రా జ్యాంగాన్ని ఉల్లంఘించదని పేర్కొంది. ఏజీఎం ఆమోదం లేకుండా, తెలంగాణ హైకోర్టులో కొన్ని కేసులు పెండింగ్‌లో ఉండగానే ప్రకటన చేసిందని స్పష్టం చేసింది.

బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం హెచ్‌సీఏ ప్రకటించిన గవర్నింగ్ కౌన్సిల్‌లో అన ర్హులైన వ్యక్తులకు చోటు కల్పించారని పేర్కొంది. తనంతట తానే సెక్రటరీగా వ్యవహరిస్తున్న బసవరాజ్, యాక్టింగ్ ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్, తాత్కాలిక సీఈవో ఇంతియాజ్ ఖాన్‌లకు ఒకే క్లబ్‌లో పదవులు ఉండడాన్ని గుర్తు చేసింది. అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు సునీ ల్ అగర్వాల్ కుమారు డు హెచ్‌సీఏ అండర్ 23 జట్టుకు ప్రాతినిథ్యం వహించడం, పా ర్థ సత్వలేకర్ అక్ర మంగా నామినేట్ చేసిన అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగానూ, అతని కుమారు డు హెచ్‌సీఏ అండర్ 19 జట్టుకు ప్రాతినిథ్యం వహిం చడాన్ని ఫిర్యాదులో పేర్కొంది.

అపెక్స్ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్న సంజీవరెడ్డి గతంలో హెచ్‌సీఏఉపై అనేకి రిట్ పిటిష న్లు దాఖలు చేసిన పిటిషినర్‌గా గుర్తు చేసిం ది. జిల్లా ప్రతినిధిగా చెప్పుకుంటున్న అగం రావు పదవీకాలం ముగిసినా అనుమానాస్పదంగా ఎన్నికయ్యారని, హెచ్‌సీఏలో జిల్లా నిధుల దుర్వినియోగం అక్రమాల అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లింది. ప్రస్తుతం ప్రకటించిన పాలక మండలిని వెంటనే రద్దు చేసి కోర్టు తీర్పులు వచ్చే వరకూ హైదారాబాద్ నగరానికి బయ ట తెలంగాణ క్రికెట్‌లో హెచ్‌సీఏ జోక్యాన్ని నిలిపివేయాలని టీసీఏ సెక్రటరీ ధరం గురువారెడ్డి డిమాండ్ చేశారు. బీసీసీఐ రాజ్యాం గాన్ని నిరంతరం ఉల్లంఘిస్తున్న హెచ్‌సీఏపై చర్యలు తీసుకోవాలని కోరింది.