ఘనంగా హనుమాన్ జయంతి
నాగోల్ రామాలయంలో వేడుకలు
హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): నాగోల్‌లోని రామాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించారు. శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవం, హనుమాన్ సువర్చల దేవి శోభాయాత్ర వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు పీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్త ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, మహా మంగళహారతులు నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. సాయంత్రం హనుమాన్ సువర్చల దేవి శోభాయాత్ర నిర్వహించారు. ఉప్పల శ్రీనివాస్‌గుప్త మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మ పరిరక్షణలో ఆలయాల పాత్ర ఎంతో గొప్పదని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కోలన్ చంద్రశేఖర్ ఆజాద్ పాల్గొన్నారు.






