10-10-2025 12:05:32 AM
ములకలపల్లి,అక్టోబర్ 9,(విజయక్రాంతి): పిడుగుపాటుకు ఇల్లు దగ్ధమైన ఘ టనలో బాధిత కుటుంబానికి గ్రామ కాంగ్రె స్ కమిటీ తరఫున గురువారం దుస్తులు, బియ్యం, వంట సామాన్లు వితరణగా అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని మూకమామిడి గ్రామంలో పుప్పాల ములకేశ్వరరా వుకు చెందిన పూరిల్లు పై పిడుగు పడిన విష యం తెలిసిందే.
బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు,వంట పాత్రలు 25 కేజీల బియ్యం, కూరగాయలు, దుస్తులు అందజేశారు.ఈ కార్యక్రమంలోమూకమామిడి మా జీ ఎంపీటీసీ సభ్యురాలు తాటి తులిసి, కాంగ్రెస్ పార్టీ పంచాయతీ అధ్యక్షులు అనంతుల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు తాటి భద్రం, కార్యదర్శి కోండ్రు ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.