calender_icon.png 10 October, 2025 | 2:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వైద్యశిబిరం

10-10-2025 12:06:54 AM

ములకలపల్లి, అక్టోబర్ 9,( విజయ క్రాంతి): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ములకలపల్లి లోని మంగ పేట వైద్య సిబ్బంది వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులకు సికిల్ సెల్, రక్తహీనత పరీక్షలు నిర్వహించారు.

విద్యార్థినీ విద్యార్థులలో రక్తం పెరగడానికి తీసుకోవాల్సిన ఆహార నియమాలను, రక్తహీనత వల న కలిగే అనర్ధాలను వారు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు కల్పన, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి అతేహార్ అలీ, వైద్య సిబ్బంది విజయలక్ష్మి, రమాదేవి, చెంచమ్మ, పావని పాల్గొన్నారు.