31-12-2025 06:40:31 PM
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్,(విజయక్రాంతి): పాస్టర్లు ప్రజల మధ్య ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. క్రిస్మస్ పురస్కరించుకుని నేపథ్యంలోని పాస్టర్లకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తాను ముందుకు వెళ్తున్నాను అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాచారం బీఆర్ఎస్ నాయకులు సాయి జెన్ శేఖర్, పాస్టర్ శ్యామ్, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.