31-12-2025 07:57:28 PM
జిల్లా పశు వైద్యాధికారి రామారావు రాథోడ్
తలమడుగు,(విజయక్రాంతి): పాడి రైతులు ఆవులు గేదెలలో వచ్చే గర్భకోశ వ్యాధుల పట్ల అప్రంతంగా ఉండాలని జిల్లా పశు వైద్యాధికారి రామారావు అన్నారు. బుధవారం తలమడుగు మండలం కుచ్చులాపూర్ గ్రామంలో పశువులలో గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ... ఆవులు గేదెలు లో గర్భ కోశ సంబంధించిన వ్యాధులను ముందే పరీక్షించి వ్యాధిని అరికట్టి చూలు కట్టించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఆవులు, గేదెలు ఎదకు వచ్చినప్పుడు కూచులపూర్ గ్రామంలో గోపాల మిత్ర ఆశన్న కు సమాచారం ఇచ్చి ఇంజక్షన్ ఇప్పించుకోవాలని చెప్పారు. గ్రామంలోని 20 ఆవులు గేదె లకు గర్భకోశ చికిత్స, 60 సాధారణ అనారోగ్య సమస్యలు కు చికిత్స చెయ్యడం జరిగిందని. గ్రామంలోని 1023 గొర్రెలు మేకలకు నట్టల మందు తప్పడం జరిగింది అన్నారు.