calender_icon.png 31 December, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగ విరమణ పొందిన ఏఎస్ఐలకు సన్మానం

31-12-2025 08:21:43 PM

సిద్దిపేట క్రైం:  సుదీర్ఘ కాలంగా విధులు నిర్వహిస్తూ బుధవారం ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను బుధవారం సిద్దిపేట కమిషనరేట్ లో సహోద్యోగులు సన్మానించారు. రాయిపోల్, గజ్వేల్ పోలీస్ స్టేషన్లలో ఏఎస్ఐలుగా విధులు నిర్వహిస్తున్న నడింపల్లి వెంకట రామకృష్ణ రాజు, కాసుల ఉమారెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా అడిషనల్ డీసీపీ అడ్మిన్ కుశాల్కర్ సన్మాన పత్రం, మెమొంటో అందజేసి శాలువాతో సత్కరించారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రిటైర్డ్ మెంట్ బెనిఫిట్ పత్రాలు అందచేశారు. కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్,  ఇన్స్పెక్టర్ రామకృష్ణ, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ మల్లేష్ గౌడ్, రాష్ట్ర పోలీస్ సంఘం ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి,  పాల్గొన్నారు.