calender_icon.png 31 December, 2025 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్జుగూడలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అవగాహన

31-12-2025 08:19:46 PM

వాంకిడి,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని అర్జుగూడలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వాంకిడి ఎస్‌ఐ మహేందర్ బుధవారం రాత్రి ప్రజలకు అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, వాటి కారణంగా ప్రాణనష్టం సంభవించే అంశాలపై ఆయన వివరించారు.డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా వాహనాలు నడపాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వాహనదారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.