calender_icon.png 31 December, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ

31-12-2025 06:37:21 PM

వాంకిడి,(విజయక్రాంతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం వీర్ బాల్ కార్యక్రమాన్ని వాంకిడి మండలం బెండార గ్రామ సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు.

వీర్ బాల్ దివాస్ కార్యక్రమంలో వాంకిడి మండలంలోని బెండార ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు వ్యాసరచన, క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబర్చి జిల్లాస్థాయి విజేతలుగా నిలిచారు. జిల్లాస్థాయి విజేతలుగా ఎంపికైన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎమ్మెల్యే కోవలక్ష్మి చేతుల మీదుగా బహుమతులు అందజేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కనకయ్య తెలిపారు. విద్యార్థుల ప్రతిభపై ప్రిన్సిపాల్ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.