25-07-2025 12:27:22 AM
దోమకొండ, జూలై 24 (విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్కనూర్, మాచారెడ్డి, రాజంపేట, బిబిపేట్, దోమకొండ మండ లాల లో గురువారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. దోమకొండ మండల కేంద్రంలోని 22 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ పండు చెక్కులను కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అందజేశారు.
రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, తహసిల్దార్ సుధాకర్, మండల బిజెపి అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, బీజేవైఎం మండలాధ్యక్షుడు కంది మనోజ్. అసెంబ్లీ కన్వీనర్ కుంట లక్ష్మారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు రవీందర్ రెడ్డి, బిజెపి నాయకులు నరేందర్ రెడ్డి, తిప్పాపురం రవి, సుజాత, గంగ జమున, శ్రీనాథ్,అంజిరెడ్డి, రంజిత్ యాదవ్, కిషోర్, సిద్ధ రాములు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.