calender_icon.png 5 August, 2025 | 11:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

32 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

05-08-2025 09:03:31 PM

బొలెరో వాహనం  సీజ్, కేసు నమోదు చేసిన పోలీసులు

గాంధారి,(విజయక్రాంతి):  రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఉచిత రేషన్ బియ్యాన్ని కొందరు  అక్రమంగా నిల్వచేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా 32 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం గాంధారి మండలం గౌరారంలో పోలీసులు పట్టుకున్నారు. బోలోరో వాహనంలో 32 క్వింటల్లా బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు గాంధారి ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో గౌరారం గ్రామంలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న  బొలెరో వాహనం ను పట్టుకున్నట్టు ఎస్సై తెలిపారు.

కోటగిరి గ్రామానికి చెందిన బొలెరో వాహనం నడుపుతున్న  మహమ్మద్ ఉమేర్  ను అదుపులోకి తీసుకున్నారు. గాంధారి మండలంలోని వివిధ గ్రామాల్లో నుండి రేషన్ బియ్యాన్ని కొనుక్కొని  వేరే రాష్ట్రాలకు రవాణా చేస్తున్న తాడ్కోల్ గ్రామం బాన్సువాడ  చెందిన  అందె మనోహర్ ను కూడా అదుపులోకి తీసు ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. బొలెరో వాహనంలో గల దాదాపు 32 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ బియ్యం బొలెరో వాహనం నెంబర్ TS 16UB4583 గల దానిలో అక్రమంగా తరలిస్తుండగా  బొలెరో వాహనాన్ని దానిలో ఉన్న పీడీఎస్ రేషన్ బియ్యం ను పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి కేసు నమోదు చేసి నట్లు ఎస్ఐ తెలిపారు.

రెవెన్యూ అధికారులకు పీడీఎస్ రేషన్ బియ్యం అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఆంజనేయులుమాట్లాడుతూ మండలంలో ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని అక్రమంగా తరలించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా మండలంలో అసాంఘిక చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.