13-08-2025 12:07:23 AM
మద్నూర్ ఆగష్టు 12 ( విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా గ్రామానికి చెందిన బిజెపి నాయకులు ప్రదీప్ పటేల్ ఇటీవల ఆరోగ్యానికి హైదరాబాద్ లో చికిత్స పొందగా,మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు 40,000 వేల రూపాయల విలువగల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు మాట్లాడుతూ...
పార్టీలకతీతంగా నాయకులకు సైతం ఆపదలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేయడం తో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు గ్రామ కాంగ్రెస్ నాయకులు కు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ హనుమాన్ మందిర్ ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్ ముంగ్దే వార్ బస్వంత్ రావ్ పటేల్ మండల అధ్యక్షుడు దారస్ సాయిలు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.