13-08-2025 12:06:28 AM
కామారెడ్డి, ఆగస్టు 12 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ చొరవతో గర్గుల్ గ్రామానికి చెందిన విట్టల్ రెడ్డి భార్య స్వరూపకు ఎల్‌ఓసి అందజేశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న విషయం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు.
షబ్బీర్ అలీకి తెలుపగా వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని అనారోగ్య బాధితురాలైన స్వరూపకు నిమ్స్ హాస్పిటల్ లో నిర్వహించే ఆపరేషన్ నిమిత్తమై షబ్బీర్ అలీ ప్రభుత్వం తరుపు నుండి 3 లక్షల రూపాయల ఎల్‌ఓసిని అందించడం జరిగింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు షబ్బీర్ అలికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.