calender_icon.png 16 August, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కరెంటు కష్టాలు

14-08-2025 12:00:00 AM

ములుగు, తాడ్వాయి ఆగస్టు12 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బిఆర్‌ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి అన్నారు. తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో ఉన్న కరెంటు సబ్ స్టేషన్ రైతులతో కలిసి సందర్శించి కరెంటు సమస్యల మీద అక్కడి అధికారులతో ఆమె చర్చించినారు.

ఈ సందర్భంగా బడే నాగజ్యోతి  మాట్లాడుతూ మేడారం చుట్టుపక్కల గ్రామాలకు త్రి ఫేస్ కరెంటు లేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, గత కొన్ని రోజుల నుండి కరెంటు సక్రమంగా రావడం లేదని, అరకోరుగా వర్షాలు పడుతున్నాయని పంట పొలాలు ఎండిపోతు న్నాయని రైతుల ఆవేదన చెందుతున్నారని, రాత్రి సమయాల్లో కరెంటు ఇవ్వడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులతో మాట్లాడిన కూడా మాపైన ఉన్న అధికారులు చెప్తున్న ప్రకారం కరెంటు ఇస్తున్నామని సబ్ స్టేషన్ లో ఉన్న అధికారులు తెలిపారని పేర్కొన్నారు