calender_icon.png 29 December, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొర్రెలకు నట్టల నివారణ మందుల పంపిణీ

29-12-2025 08:32:26 PM

చిన్నంబావి: మేకలు, గొర్రెలకు సామూహిక ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ మేఖల పద్మావతి ప్రారంభించారు. గొర్రెల పెంపకం దారులు సద్వినియోగం చేసుకొవాలని ఆమె అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం అయ్యవారి పల్లి గ్రామంలో ఉపసర్పంచ్‌ లింగ రాజు, పశుసంవర్ధక శాఖకు చెందిన టి.గంగరాజుతో కలిసి కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ అధికారి మాట్లాడుతూ జీవాలకు ఉచితంగా నట్టాల నివారణ మందులను వాడడం వల్ల గొర్రెలు మేకలలో జీర్ణ క్రియ మెరుగు పడటంతో పాటు బరువు పాల ఉత్పత్తి పెరుగుతుందని,వ్యాధి నిరోధక శక్తి బలపడుతుందని,గోర్లు, మేకలు ఆరోగ్యవంతంగా ఉంటాయని అన్నారు.