calender_icon.png 29 December, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడవ రోజుకు చేరుకున్న పాత్రికేయుల దీక్షలు

29-12-2025 08:36:46 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న పాత్రికేయులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు సోమవారం నాటికి ఏడవ రోజుకు చేరుకున్నాయి. ఆర్డీవో కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షలో పాత్రికేయులు పాల్గొని తమ న్యాయబద్ధమైన డిమాండ్ల పరిష్కారం అయ్యేవరకు దీక్షలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. తమ దీక్షలకు వివిధ వర్గాల వారు మద్దతు తెలపడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీధర్, ప్రధాన కార్యదర్శి లచ్చన్న పాత్రికేయులు పాల్గొన్నారు.