calender_icon.png 22 November, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

'పది' విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ

22-11-2025 06:39:15 PM

చిగురుమామిడి (విజయక్రాంతి): మండలంలోని తొమ్మిది జడ్‌పీ హై స్కూళ్లు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో పదో తరగతి చదువుతున్న 263 మంది విద్యార్థులకు గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు. ట్రస్ట్ నిర్వాహకుడు గంగిశెట్టి జగదీశ్వర్ శనివారం ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 2011 నుంచి ట్రస్ట్ పేద విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ల పంపిణీ చేస్తోందని, ఇప్పటివరకు 10 వేల మందికి పైగా విద్యార్థులు లాభపడ్డారని జగదీశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత భాషబత్తిని ఓదెలు కుమార్‌తో పాటు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.