calender_icon.png 22 November, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

బీఆర్ఎస్‌ది ప్రభుత్వ ఖజానా నింపే పాలసీ.. కాంగ్రెస్‌ది జేబులు నింపుకునే పాలసీ

22-11-2025 06:56:17 PM

హైదరాబాద్: కీలకమైన భూములపై తెలంగాణ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. రెండేళ్లు బడ్జెట్ కు సరిపడా నిధులు వచ్చే అంశంపై కనీస చర్చ లేదని, మంత్రిమండలి, అసెంబ్లీలో చర్చించకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆయన మండిపడ్డారు. పారిశ్రామిక భూములకు వారం రోజుల్లోనే అనుమతి ఇచ్చి 45 రోజుల్లోనే డబ్బులు కట్టాలనేందుకు అధికార ప్రతినిధులు ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు.

రూ.5 లక్షల కోట్లు వచ్చే భూములకు కేవలం రూ.5 వేల కోట్లు ఎలా వస్తాయని హరీశ్ రావు ప్రశ్నించారు. రెండు నెలల్లోనే ఆ భూములను అమ్మేసి రూ.5 లక్ష కోట్ల స్కామ్ ఖతం చేయాలని చూస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. ఇంత వేగంగా భూముల అమ్మకాలు  పూర్తి చేయడం వెనకున్న రహస్యం ఏమిటి? అని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే హరీశ్ రావు సూటిగా ప్రశ్నించారు. భూములకు బహిరంగ మార్కెట్లో వేలం వేస్తే రూ.5 లక్షల కోట్లు వస్తాయని, ప్రభుత్వ అవసరాలకు కూడా భూమి లేకుండా ఎలా విక్రయిస్తున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి అడిగారు.

కాలుష్యకారక పరిశ్రమలనే ఓఆర్ఆర్ అవతలకు పంపించాలనేది పాలసీ అని, ఈ ప్రభుత్వం మాత్రం గ్నీన్ ఇండస్ట్రీలను కూడా బయటికి పంపిస్తోందని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు. భారీ భూకుంభకోణంపై కేంద్రంలోని బీజేపీ ఎందుకు స్పందించట్లేదు..? అని అడిగారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీ కుమ్మక్కు అయ్యాయని హరీశ్ రావు ఆరోపించారు. ఆనాడు ప్రభుత్వ భూములు అమ్మొద్దని మాట్లాడిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఎకరాలు, గుంటలు, గజాలు ఏవీ వదలకుండా తెగనమ్ముతున్నాడని ఈయన అనుముల రేవంత్ రెడ్డి కాదు.. అమ్మకాల రేవంత్ రెడ్డి అని వ్యంగ్యంగా మాట్లాడారు. హైదరాబాద్ లో భవిష్యత్తు అవసరాల కోసం ఉంచిన భూములను రేవంత్ రెడ్డి అమ్మేస్తున్నాడు.

హెచ్ఐఎల్టీపీ(HILTP) పాలసీతో కాంగ్రెస్ చేస్తున్న లక్షల కోట్ల ల్యాండ్ స్కామ్ నిజమని ఒప్పుకున్నందుకు మంత్రి శ్రీధర్ బాబుకి హరీశ్ రావు ధన్యవాదాలు తెలిపారు. పారిశ్రామిక వాడల్లోని భూములను రిజిస్ట్రేషన్ వాల్యూలో 30 శాతం కడితే చాలు అని శ్రీధర్ బాబు చెప్పాడని, నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడానికి టీఎస్ఐపాస్ పాలసీ తెచ్చిందని గుర్తు చేశారు. మాది ప్రభుత్వ ఖజానా నింపే పాలసీ అని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న భూములను అమ్మడానికి హెచ్‌ఐఎల్‌టీపీ పాలసీ తెచ్చి దీంతో కాంగ్రెస్ జేబులు నింపుకుందని హరీశ్ రావు పేర్కొన్నారు.