22-11-2025 06:56:41 PM
రాజాపూర్: రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలో అండర్-19 బాలిక విభాగంలో పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాజాపూర్ విద్యార్థిని కీర్తన ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ ఇబ్రహీం తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో జరుగు రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటుందని తెలిపారు. కీర్తన రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన సందర్బంగా శనివారం ఫిజికల్ డైరెక్టర్ వెంకటమ్మను ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. కీర్తన జాతీయ స్థాయిలో రాణించాలని పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఆకాంక్షించారు.