calender_icon.png 22 November, 2025 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతను పరామర్శించిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

22-11-2025 06:59:46 PM

మేడ్చల్ అర్బన్ (విజయక్రాంతి): మేడ్చల్ మున్సిపల్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు చీదు వీర భద్రారెడ్డిని మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత వీర భద్రారెడ్డి మాట్లాడుతూ తనకు పొత్తికడుపులో పెద్ద ప్రేగుకు గడ్డ సంభవించి క్యాన్సర్ వ్యాధికి దారి తీసిందని క్యాన్సర్ వ్యాధి శాస్త్ర చికిత్సకు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని సంప్రదించగా మల్లారెడ్డి ఆసుపత్రిలో చేరండి శాస్త్ర చికిత్స ఉచితంగా చేపిస్తానని చెప్పి తన ప్రాణాలు కాపాడారని ఆయన కొనియాడారు.

శస్త్ర చికిత్సకు వైద్య ఖర్చులు ప్రైవేట్ ఆస్పత్రులలో సుమారు 16 లక్షల నుండి 18 లక్షల వరకు అవుతుందని చెప్పారని తను ఆర్థికంగా చాలా వెనుకబడ్డారని మాజీ మంత్రి మల్లారెడ్డిని కోరగా ముందుగా ఆసుపత్రిలో చేరండి శస్త్ర చికిత్స తర్వాత డబ్బుల విషయం మాట్లాడుదాం అవసరం లేదు ఉంటే ఇవ్వండి లేకుంటే లేదని మాకు భరోసా ఇచ్చారని వీర భద్రారెడ్డికి చెప్పినట్లు ఆయన తెలిపారు.

తాను క్యాన్సర్ బాధతో బాధ పడుతుండగా ఆప్తుడి లాగా మేడ్చల్ ఎమ్మెల్యే సిహెచ్ మల్లారెడ్డి శస్త్ర చికిత్సలు ఉచితంగా చేపించి తనకు ఎంతో సహాయం చేశారని ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తనకు వైద్య ఖర్చు లేకుండా శస్త్ర చికిత్స చేయించిన ఎమ్మెల్యే మల్లారెడ్డికి తన కుటుంబం ఎన్నటికీ రుణపడి ఉంటుందని వీర భద్రారెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వీర్లపల్లి రాజ మల్లారెడ్డి. మాజీ గ్రంథాలయ చైర్మన్ బి భాస్కర్ యాదవ్. బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చీర్ల దయానంద్ యాదవ్. మెరుగు మోహన్ రెడ్డి. దర్శన్. శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.