22-11-2025 07:14:31 PM
డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్
మంగపేట (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం దివ్యంగ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు అనేక రకాల సదుపాయాలు కల్పిస్తున్న కూడా ములుగు జిల్లా డిడబ్ల్యూడి డిఈఓ ఏంఈఓ ఆఫీసులలో అధికారులు దివ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల వేతనాలను పట్టించుకోకుండా చిన్న చూపు చూస్తున్నారని నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారని డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మండల కేంద్రంలో మీడియా సమావేశంలో గడ్డం శ్రీనివాసు మాట్లాడుతూ మన ములుగు జిల్లాలో అధికారులకు దివ్యంగ ఉద్యోగులు ఏదైనా సమాచారం కోసం అప్లికేషన్ పెడదామని కార్యాలయాలకు వెళ్తే మాకు తెలియదు మాకు సమాచారం లేదు రాష్ట్రానికి తెలుసు రేపు రాపో తర్వాత రాపో అని ఇలా తప్పించుకునే నానవేసె దొరణి చేస్తు దివ్యంగా ఉద్యోగులను చిన్న చూపు చూస్తున్నారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిడబ్ల్యూడి డిఈఓ ఏంఈఓ శాఖలు అలాగనే పనిచేస్తున్నాయి ప్రస్తుతం డీడబ్ల్యూడి శాఖలో దివ్యాంగుల శాఖ రాష్ట్ర సమాచారం కోసం స్టేట్ లింకు పెట్టమంటే శాఖ అధికారి తుల రవి నాగేందర్ అనే అధికారులు ఎటువంటి సమాచారం లేకుండా తప్పించుకునే ధోరణి చేస్తున్నారు అదేవిధంగా గతంలో డిఈఓ శాఖలో మా రాష్ట్ర జిల్లా లెటర్ ప్యాడ్ తో మా సంఘం పూర్తి సమాచారంను ఇచ్చిన కూడా జిల్లా ఉపాధ్యాయ సంఘాల సమావేశానికి మాకు ఆహ్వానం రాలేదు దివ్యాంగ ఉపాధ్యాయులు స్థానిక ఎలక్షన్ డ్యూటీ మినహాయింపు చేయమని ఎంఈఓ కు లెటర్లతో సహా ఇచ్చిన కూడ ఇది చెల్లుబాటు కాదు అని కార్యాలయంలో మమ్ముల్ని అవహేళన చేస్తున్నారు మా పట్ల అధికారుల తీరు మారాలి అని గడ్డం శ్రీనివాస్ హెచ్చరించారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి పంచ కప్పు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రి దణసరి అనసూయ సీతక్క ములుగులో ఉన్నా కూడా అధికారులు ఇలా చేస్తున్నరంటే అర్థం కావడం లేదు కావున దయచేసి జిల్లా కలెక్టర్ పైన తెలిపిన విషయమును పూర్తిగా పరిశీలింప చేసి దివ్యంగ ఉద్యోగ ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు ఇచ్చుకుంటూ ఉద్యోగ సంఘాల సమన్వయ సమావేశమునకు ఆహ్వానం పలుకుతూ దివ్యాంగులకు ఎలక్షన్ డ్యూటీ మినహాయింపు ఇస్తూ తగు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో కోశాధికారి తీగల రజిత వెంకటేశ్వర్లు రఘు నరేందర్ రెడ్డి వెంకట నరేష్ పటాన్ ఆస్మా బేగం శశిధర్ రెడ్డి సుదర్శన్ రమేష్ పాల్గొన్నారు.