14-07-2025 01:36:28 AM
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
- కాస్మోపాలిటన్ కాలనీలో ఓపెన్ జిమ్, పార్క్ ప్రారంభం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 13 (విజయక్రాంతి): నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మన్సూరా బాద్ డివిజన్ కాస్మోపాలిటన్ కాలనీలో ఓపెన్ జిమ్, పార్క్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టానని, రానున్న రోజుల్లో కాలనీ వాసుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరిన్ని అభివృద్ధి పనులు చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రజలందరూ తమ కాలనీని శుభ్రంగా ఉంచుకోవాలని, ఒక భాద్యతగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, జెక్కిడి రఘువీర్‌రెడ్డి, డివిజన్ మాజీ అధ్యక్షుడు పోచబోయిన జగదీశ్ యాదవ్, టంగుటూరి నాగరాజు, విజయభాస్కర్‌రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, కాలనీ వాసులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.