12-08-2025 07:21:53 PM
వరంగల్ (విజయక్రాంతి): వరంగల్ నగరంలోని నీట మునిగిన శివనగర్, అండర్ బ్రిడ్జ్, లక్ష్మీపురం, వెంకటరమ జంక్షన్, ఎల్బీనగర్, లోతుకుంట తదితర ప్రాంతాల్లో జి ఆర్ కే ఫౌండేషన్(GRK Foundation) ఆధ్వర్యంలో కాలనీవాసులకు ఆహార పొట్లాలను మంగళవారం అందజేశారు. నీట మునిగినా ప్రాంతాల పేద కుటుంబాలకు గంట రవి కుమార్(జిఆర్కే) ఫౌండేషన్ మంగళవారం ఆహార పొట్లాలు అందజేశారు. గంట రవికుమార్ ఆదేశాల మేరకు జి ఆర్ కె ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టి, నిరుపేద కుటుంబాలకు ఆహారాన్ని అందజేశారు. ఈ మేరకు ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీ, సభ్యులు శివకుమార్ బాధితులకు అండగా ఉంటూ వారికి భవిష్యత్తులో మరింత అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఫౌండేషన్ ఎప్పుడు ముందు వరసలో ఉంటుందని ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు. అలాగే వారికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.