12-08-2025 09:30:47 PM
గాంధారి (విజయక్రాంతి): రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని గాంధారి మండల వ్యవసాయ అధికారి రాజలింగం(Mandal Agriculture Officer Rajalingam) అన్నారు. ఈ మేరకు మంగళవారం రోజున గాంధారి మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని రైతులందరికీ రైతు బీమాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు లోపు పట్ట పాసుబుక్కు కలిగిన ప్రతి రైతు బీమా కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగిందని అదేవిధంగా నామినీలో పేర్లు మార్పు చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం జరిగిందని కావున ఇట్టి అవకాశాన్ని మండలంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లు నిఖిత, కర్నేశ్వర్ హారతి, రైతులు తదితరులు పాల్గొన్నారు