calender_icon.png 12 August, 2025 | 10:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందించాలి

12-08-2025 07:18:44 PM

రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): కోల్ బెల్ట్ ఏరియా ఓపెన్ కాస్ట్ సమీప గ్రామమైన అమరవాది, శేషుపల్లి ప్రజలకు సింగరేణి ఉచిత వైద్య సేవలను అందించాలని 5 వార్డు మాజీ కౌన్సిలర్ జీలకర మహేష్ మంగళవారం రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి డివై సిఎంఓ డా.ప్రసన్నకుమార్(DY CMO Dr. Prasanna Kumar)కు విజ్ఞప్తి చేస్తూ మెమరాండం అందించారు. గనుల తవ్వకాలు జరగడం వల్ల పర్యావరణ కాలుష్యంతో తమ గ్రామ ప్రజలకు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని మహేష్ వైద్యాధికారికి వివరించారు. స్పందించిన సింగరేణి ఆసుపత్రి డివై సిఎంఓ డా.ప్రసన్నకుమార్ త్వరలోనే అమరవాది, శేషుపల్లి గ్రామల్లో వైద్యశిభిరం ఏర్పాటు ప్రజలకు ఉచిత సేవలు, మందులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.