12-08-2025 07:24:25 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణాను అడ్డుకోవడానికి ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చిన జాగిలం ద్వారా రైల్వే స్టేషన్లలో మంగళవారం సాయంత్రం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా డాగ్ స్క్వాడ్ బృందం, కేసముద్రం ఎస్ఐ మురళీధర్ రాజ్(SI Muralidhar Raj) ఆధ్వర్యంలో కేసముద్రం, ఇంటికన్నె రైల్వే స్టేషన్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానం వచ్చిన ప్రయాణికుల వస్తువులను, బ్యాగులను జాగిలం ద్వారా తనిఖీ నిర్వహించారు.