calender_icon.png 24 November, 2025 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుమ్మర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

24-11-2025 05:35:39 PM

చిట్యాల (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉన్న కుమ్మర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులను కేటాయించి వారి అభివృద్ధికి కృషి చేయాలని కుమ్మర్ల సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు తాడూరి చంద్రం అన్నారు. సోమవారం చిట్యాల మండలంలోని వనిపాకల గ్రామంలో జరిగిన సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కుమ్మర్ల హక్కులు సాధించుకోవడం కోసం ఐక్యంగా ప్రభుత్వంపై పోరాటం చేసి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన గ్రామ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా మిడిదొడ్డి వెంకటయ్య, ప్రధాన కార్యదర్శిగా మిడిదొడ్డి సైదులు, ఉపాధ్యక్షులుగా మిడిదొడ్డి శైలేందర్, సహాయ కార్యదర్శిగా మిడిదొడ్డి విజయ్, కోశాధికారిగా గోపాల్ తో పాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.