calender_icon.png 24 November, 2025 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ

24-11-2025 08:15:11 PM

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క..

సిద్దిపేట కలెక్టరేట్: రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు వడ్డీ రహిత రుణాల పంపిణీని నవంబర్ 25 నుంచి ప్రారంభిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం మంత్రి సీతక్క, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, అన్ని జిల్లాల కలెక్టర్లు స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ చీరల పంపిణీ విజయవంతం కావడంపై కలెక్టర్లను అభినందించిన ఉప ముఖ్యమంత్రి, రుణాల పంపిణీ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.304 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. 

మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, చీరల పంపిణీ పండుగ వాతావరణంలో సాగినట్టు, రుణాల పంపిణీ కూడా సజావుగా జరగాలని సూచించారు. సిఎస్ రామకృష్ణారావు, పీఆర్‌ఆర్‌డి ప్రిన్సిపల్ సెక్రటరీ దివ్య కూడా సమన్వయం, క్రమశిక్షణతో కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కె.హైమావతి మాట్లాడుతూ, జిల్లాలో 1,99,644 సంఘ సభ్యులకు చీరల పంపిణీ పూర్తవుతున్నదని, రుణాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, డిఆర్వో, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.