24-10-2025 10:56:45 PM
మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి
బానోతు వెంకటేశ్వర్లు
గరిడేపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నత లక్ష్యంతో తలపెట్టిన మెగా జాబ్ మేళా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నిరుద్యోగ యువతకు వరంలా నిలిచిందని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బానోతు వెంకటేశ్వర్లు (వి.టి) తెలిపారు.శుక్రవారం ఆయన గరిడేపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ హుజూర్నగర్ నియోజకవర్గాన్ని దేశంలో, రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగానే హుజూర్నగర్ పట్టణంలో శనివారం,ఆదివారం రెండు రోజులపాటు మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ జాబ్ మేళా నిరుద్యోగులుకు చక్కని అవకాశమని, టెన్త్ పాస్ ఇంటర్, ఐటిఐ, డిప్లమా, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, పిజీ, ఫార్మసీ పూర్తి చేసిన వారికి ఉపాధి కలిగించేందుకు జాబ్ మేళాను ఏర్పాటు చేశారని తెలిపారు. ఉద్యోగాల కోసం హైదరాబాద్ వెళ్లకుండానే హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో జాబ్ మేళా నిర్వహించడం విశేషం అన్నారు.హుజూర్నగర్ పట్టణంలోని పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ పాఠశాలలో శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం వరకు రెండు రోజులపాటు జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.