calender_icon.png 25 October, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బహుజన రాజ్యం దిశగా టీఆర్పీ సంకల్పం

24-10-2025 10:43:48 PM

తెలంగాణలో బీసీలకు అన్ని రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అందే వరకు పోరాటం చేస్తాం

టిఆర్పి ముఖ్య నాయకులు సమావేశం

టీఆర్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  పల్లెబోయిన అశోక్ ముదిరాజ్

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ శారద ఫంక్షన్ హాల్లో శుక్రవారం టిఆర్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ ఆధ్వర్యంలో టిఆర్పి జిల్లా, నియోజకవర్గ కన్వీనర్లు, కో కన్వీనర్లు నియామకంపై ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజని కుమార్ యాదవ్  పాల్గొని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇన్నాళ్లు బీసీల పేరుతో ఓట్లు సేకరించి అగ్రవర్ణాల పక్షాన నిలిచిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల అసలు స్వరూపాన్ని ప్రజల ముందుకు తెస్తామని హెచ్చరించారు.

తెలంగాణలో బీసీలకు అన్ని రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అందే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాజకీయ రంగం మాత్రమే కాదు, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల వరకు రిజర్వేషన్ అమలుకు టీఆర్పీ కట్టుబడి ఉందని అన్నారు. మా వర్గాల ప్రజలందరినీ ఐక్యం చేసి బహుజనుల రాజ్యాన్ని తెలంగాణలో నెలకొల్పుతామన్నారు. తీన్మార్ మల్లన్న నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం మరింత బలంగా కొనసాగుతుంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ వైఖరిని మార్చుకోకపోతే వారికి తెలంగాణలో రాజకీయ సమాధి తప్పదని అన్నారు.

రాబోయే 100 రోజుల్లో బహుజనుల డంక తెలంగాణ అంతటా మోగబోతోందని తెలిపారు. జిల్లా స్థాయి నాయకుల నియామకంపై సూచనలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగింది అని అన్నారు. మేమెంతో మాకు అంత అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో టీఆర్పీ జెండా ఎగురవేసి బహుజన ఉద్యమాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్తామని తీర్మానించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగాం,  భూపాలపల్లి, ములుగు జిల్లాల నియోజకవర్గ  కన్వీనర్లు, కో కన్వీనర్లను నియమించడం కోసం టిఆర్పి ముఖ్య నాయకులతో చర్చ జరిగిందన్నారు.