24-10-2025 10:53:34 PM
టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి హెచ్ వెంకటేశ్వరరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటివరకు ఎఫ్ ఆర్ ఎస్ కానీ విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ చేయించాలని ఆదేశించారు. ప్రతిరోజు విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని డ్రాప్స్ ను తగ్గించాలని అధ్యాపకులకు సూచించారు.
విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని కష్టపడ్డ వారికి ఫలితం తప్పకుండా లభిస్తుందని తెలిపారు. రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బి సులోచన రాణి, అధ్యాపకులు బసవమ్మ, సత్యవతి, ముంతాజ్ అలీ, యాకూబ్, శ్రీనివాసరావు, ప్రమోద్ కుమార్, నాగేశ్వరరావు, సంజీవరెడ్డి, అధ్యాపకేతర సిబ్బంది గిరి ప్రసాద్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.